పదుగురాడుమాట పాడియై థరజెల్లు..అన్నది నానుడి. దీనే్న ఆదర్శంగా తీసుకుంటే కనుక, తీన్‌మార్ అనే సినిమా చాలా చాలా బాగుంది. పవన్‌కళ్యాణ్ చక్కగా బ్యాలెన్స్‌డ్‌గా నటించాడు. త్రిష వీలయినంత చిట్టిపొట్టి దుస్తుల్లో, ఒళ్లు దాచుకోకుండా, అందంగా కనిపించింది. అటు కేప్‌టౌన్ నేపథ్యంలో తీసిన చిత్రంలో పవన్ ఇటాలియన్‌లో గడగడా మాట్లాడుతుంటే, నేపథ్యంలో మెక్సికన్, స్పానిష్ తరహా సంగీతం వినిపించడం బలేగా వుంది. విదేశాలను ఆదర్శంగా తీసుకుని, యూజ్ అండ్ ధ్రో తరహాలో రూపొందించిన ప్రేమకథ, మల్టీఫ్లెక్స్ ప్రేక్షకులను (బి, సి సెంటర్లకు అదనంగా ఇటీవల పుట్టుకొచ్చిన కొత్త తరగతి ఇది) ఆకట్టుకుంది. సంగీత కుటుంబం నుంచి వచ్చిన మణిశర్మ తన యథాశక్తి మార్చిన ‘ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది’ పాట మారుతున్న కొత్త ట్రెండ్‌కు అద్దం పట్టింది. ఈ పాటలో విదేశీ ముద్దుగుమ్మల నడుం ఊపులు కుర్రకారుకు హుషారునిచ్చాయ. ‘చీరలో కనిపించి వుంటే అస్సలు నిన్ను వదిలి వుండేవాణ్ణికాదుకదా’, ‘ఇంత సన్నని చిన్న నడుం అంతంతబరువులు ఎలా మోస్తోందో’ లాంటి ధర్మసందేహాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతంగా రాశారు. సినిమా ఆద్యంతం వీలయినంత చిన్న దుస్తులు వేసుకున్న విదేశీవనితల అందాలను కళ్లకు కట్టిన కెమేరా పనితనం బాగుంది. మదిలో ప్రియురాలు వున్నా, పంతంతో మరో తెల్లపిల్లతో హీరో పడుకోవడం, కథను మన నేటివిటీకి అనుగుణంగా మార్చిన దర్శకుడి ఘనతకు అద్దం పట్టింది.
ఇలాంటి సినిమాకు సంబంధించిన కథను స్థూలంగా చూస్తే, డేటింగ్ స్టయిల్‌లో కొద్ది రోజుల పాటు కలసి గడిపి, ఆపై పెద్దగా కారణాలు లేకుండానే విడిపోయిన జంట మైకేల్ వేలాయుధం(పవన్‌కళ్యాణ్), మీరాశాస్ర్తీ (త్రిష). ఇండియా వచ్చిన తరువాత మైకేల్, మీరాల నడుమ ప్రేమ వుందా లేదా అన్నసంగతి పక్కన పెడితే, మైకేల్ ఓ పరదేశీ అమ్మాయితో కలిసి వుండడం ప్రారంభించగా, మీరా ఇండియాలోని ఓ వర్ధమాన రాజకీయనాయకుడి (సోనూసూద్)ని పెళ్లిచేసుకోవాలని అనుకుంటుంది. మైకేల్ వ్యవహారాన్ని గమనించిన ఓ పెద్దమనిషి (పరేష్‌రావల్) తన స్నేహితుడు అర్జున్‌పాల్వాయి (పవన్‌కళ్యాణ్) ప్రేమకథను వివరిస్తాడు. అచ్చం మైకేల్‌లాగే వుండే అర్జున్ ప్రేమకథ ఇతగాడి ప్రేమకథకు ఎంత భిన్నంగా వుందో వివరిస్తాడు. ఈ నేపథ్యంలో మైకేల్, మీరాల ప్రేమ ఏ తీరానికి చేరిందన్నది మిగిలిన కథ.
స్థూలంగా చూస్తే కథ బాగున్నట్లే. తరాల అంతరాల కారణంగా మారుతున్న విలువలను వివరించే లక్ష్యం దిశగా సాగితే మంచిదే. కానీ..పాల కన్నా నీళ్లు ఎక్కువైనట్లు..అర్ధవంతంగా వుండే అసలు లక్ష్యం కన్నా, ‘అర్థ’మే పరమార్ధమై, కాసులకోసం పెట్టిన కొత్త తరపు సరదాల జోరే ఎక్కువైంది. పవన్‌కళ్యాణ్ లాంటి ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ కలిగిన నటుడితో తీయడానికి కథ సరిపోయినా, స్క్రీన్‌ప్లేలో ఉపయోగించిన కొత్త తరహా సామాన్య ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెడుతుంది. దిగజారుడు విదేశీ సంస్కృతిని, మన మంచి సంస్కృతిని కలిపి ముడిపెట్టి చూపించాలన్న ప్రయత్నం వరకు ఓకె. కాశీ ఎపిసోడ్ ఎంత బాగున్నా, దాన్ని ముక్కముక్కలుగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరపైకి రప్పించడం, నడుమ వర్తమానపు హోరు వినిపించడంతో, ఆ సున్నితం, హాయి
మచ్చుకి కూడా ఎటువంటి అనుభూతిని కలిగించకపోగా, సగటు ప్రేక్షకుడిని నిరాశకు గురిచేసాయి. ఇటీవల వచ్చిన ఆరెంజ్ సినిమాలో కనీసం, లాంగ్ టెర్మ్ రిలేషన్ షిప్ గురించి కాస్త విస్తారమైన చర్చ వుంది. కానీ ఇందులో అసలు హీరో, హీరోయిన్‌ను ఎందుకు వదిలేసాడు అని ప్రశ్నిస్తే కనుక, సగటు ప్రేక్షకుడు చెప్పడానికి సరైన సమాధానం వుండదు. అంతవేగంగా ఆ సన్నివేశం రీలు చుట్టేసారు మరి..పైగా ఎంతో అమెచ్యూర్‌గా, ‘నువు చీరలో ఇంతకు ముందే కనిపించి వుంటే నిన్ను వదిలిపెట్టి వుండేవాడిని కాదు’ అనడం త్రివిక్రమ్ వంటి పరిణితి చెందిన మాటల రచయిత నుంచి ఆశించగలిగినది మాత్రం కాదు. అంటే ఏది మంచి అన్నది అంతవరకు హీరోకి తెలియకపోవడం వల్లే చెడ్డదారిన నడిచాడనా? ఆయన చెప్పదలుచుకున్నది? పైగా హీరోకి, మనవారు అనుకునేవారి పట్ల అభిమానం తెలిసేలా చేయడానికి ఏర్పాటుచేసిన 50మిలియన్‌డాలర్ల ఎపిసోడ్ కృతకంగా వుంది. చట్టాలు, పోలీసులు కట్టుదిట్టంగా వుండే దేశంలో నడిరోడ్డులో తీసిన ఆ ఎపిసోడ్ అర్ధవంతంగా లేదు. ఏదో చేద్దామనుకుంటే ఏదో అయినట్లు, హీరో క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా తీర్చిదిద్దుదామనుకుని, కాసనోవాగా మార్చారు. కానీ హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మాత్రం వీలయినంత జాగ్రత్త పడ్డారు. అదే జాగ్రత్త హీరో క్యారెక్టర్ విషయంలో పడివుంటే బాగుండేది. సినిమాలో సరసాలు చూస్తే హై ఫై, కానీ మళ్లీ క్లయిమాక్స్‌కు వచ్చేసరికి పక్కా మేడిన్ ఆంధ్రా మాదిరిగా, హీరో సరాసరి, ప్రియురాలు పెళ్లిచేసుకోవాలనుకునే వాడి ఇంటికి వస్తూనే, కనపడ్డవాడినల్లా చితకబాదడం. మామూలు సినిమా మాదిరిగా చూస్తే మాత్రం హీరో హీరోయిన్ల చక్కటి నటన, వినెసంట్ వారసుడి చక్కటి ఫోటోగ్రఫీ, కాసిన్ని పంచ్‌డైలాగులు (పాడె కట్టడానికి బట్టల దండెం కట్టడానికి పెద్ద తేడాలేదు..కాస్త గట్టిగా కట్టాలంతే, ఎందుకంటే బట్టలకంటే, వాటిని వేసుకునేవాడు ఎక్కువ బరువుంటాడు కదా), బోల్డెన్ని డబ్బులు ఖర్చు చేసిన సగటు సినిమా తీన్‌మార్. తీన్‌మార్ సినిమాకు ఎన్ని డబ్బులు వచ్చాయి. ఎన్ని డబ్బాల ప్రింట్లు వేసారు అన్నది కాస్సేపు పక్కన పెడదాం. ఎంత మంచి చిత్రం అన్నది మాత్రం కాస్త ఆలోచించాలి?

cinimaa...baagundaa...chudaali mari
ReplyDelete