Saturday, 23 April 2011

తీన్‌మార్ (ఆంధ్రభూమి రివ్యూ)



పదుగురాడుమాట పాడియై థరజెల్లు..అన్నది నానుడి. దీనే్న ఆదర్శంగా తీసుకుంటే కనుక, తీన్‌మార్ అనే సినిమా చాలా చాలా బాగుంది. పవన్‌కళ్యాణ్ చక్కగా బ్యాలెన్స్‌డ్‌గా నటించాడు. త్రిష వీలయినంత చిట్టిపొట్టి దుస్తుల్లో, ఒళ్లు దాచుకోకుండా, అందంగా కనిపించింది. అటు కేప్‌టౌన్ నేపథ్యంలో తీసిన చిత్రంలో పవన్ ఇటాలియన్‌లో గడగడా మాట్లాడుతుంటే, నేపథ్యంలో మెక్సికన్, స్పానిష్ తరహా సంగీతం వినిపించడం బలేగా వుంది. విదేశాలను ఆదర్శంగా తీసుకుని, యూజ్ అండ్ ధ్రో తరహాలో రూపొందించిన ప్రేమకథ, మల్టీఫ్లెక్స్ ప్రేక్షకులను (బి, సి సెంటర్లకు అదనంగా ఇటీవల పుట్టుకొచ్చిన కొత్త తరగతి ఇది) ఆకట్టుకుంది. సంగీత కుటుంబం నుంచి వచ్చిన మణిశర్మ తన యథాశక్తి మార్చిన ‘ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది’ పాట మారుతున్న కొత్త ట్రెండ్‌కు అద్దం పట్టింది. ఈ పాటలో విదేశీ ముద్దుగుమ్మల నడుం ఊపులు కుర్రకారుకు హుషారునిచ్చాయ. ‘చీరలో కనిపించి వుంటే అస్సలు నిన్ను వదిలి వుండేవాణ్ణికాదుకదా’, ‘ఇంత సన్నని చిన్న నడుం అంతంతబరువులు ఎలా మోస్తోందో’ లాంటి ధర్మసందేహాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతంగా రాశారు. సినిమా ఆద్యంతం వీలయినంత చిన్న దుస్తులు వేసుకున్న విదేశీవనితల అందాలను కళ్లకు కట్టిన కెమేరా పనితనం బాగుంది. మదిలో ప్రియురాలు వున్నా, పంతంతో మరో తెల్లపిల్లతో హీరో పడుకోవడం, కథను మన నేటివిటీకి అనుగుణంగా మార్చిన దర్శకుడి ఘనతకు అద్దం పట్టింది.
ఇలాంటి సినిమాకు సంబంధించిన కథను స్థూలంగా చూస్తే, డేటింగ్ స్టయిల్‌లో కొద్ది రోజుల పాటు కలసి గడిపి, ఆపై పెద్దగా కారణాలు లేకుండానే విడిపోయిన జంట మైకేల్ వేలాయుధం(పవన్‌కళ్యాణ్), మీరాశాస్ర్తీ (త్రిష). ఇండియా వచ్చిన తరువాత మైకేల్, మీరాల నడుమ ప్రేమ వుందా లేదా అన్నసంగతి పక్కన పెడితే, మైకేల్ ఓ పరదేశీ అమ్మాయితో కలిసి వుండడం ప్రారంభించగా, మీరా ఇండియాలోని ఓ వర్ధమాన రాజకీయనాయకుడి (సోనూసూద్)ని పెళ్లిచేసుకోవాలని అనుకుంటుంది. మైకేల్ వ్యవహారాన్ని గమనించిన ఓ పెద్దమనిషి (పరేష్‌రావల్) తన స్నేహితుడు అర్జున్‌పాల్వాయి (పవన్‌కళ్యాణ్) ప్రేమకథను వివరిస్తాడు. అచ్చం మైకేల్‌లాగే వుండే అర్జున్ ప్రేమకథ ఇతగాడి ప్రేమకథకు ఎంత భిన్నంగా వుందో వివరిస్తాడు. ఈ నేపథ్యంలో మైకేల్, మీరాల ప్రేమ ఏ తీరానికి చేరిందన్నది మిగిలిన కథ.
స్థూలంగా చూస్తే కథ బాగున్నట్లే. తరాల అంతరాల కారణంగా మారుతున్న విలువలను వివరించే లక్ష్యం దిశగా సాగితే మంచిదే. కానీ..పాల కన్నా నీళ్లు ఎక్కువైనట్లు..అర్ధవంతంగా వుండే అసలు లక్ష్యం కన్నా, ‘అర్థ’మే పరమార్ధమై, కాసులకోసం పెట్టిన కొత్త తరపు సరదాల జోరే ఎక్కువైంది. పవన్‌కళ్యాణ్ లాంటి ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ కలిగిన నటుడితో తీయడానికి కథ సరిపోయినా, స్క్రీన్‌ప్లేలో ఉపయోగించిన కొత్త తరహా సామాన్య ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెడుతుంది. దిగజారుడు విదేశీ సంస్కృతిని, మన మంచి సంస్కృతిని కలిపి ముడిపెట్టి చూపించాలన్న ప్రయత్నం వరకు ఓకె. కాశీ ఎపిసోడ్ ఎంత బాగున్నా, దాన్ని ముక్కముక్కలుగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరపైకి రప్పించడం, నడుమ వర్తమానపు హోరు వినిపించడంతో, ఆ సున్నితం, హాయి
మచ్చుకి కూడా ఎటువంటి అనుభూతిని కలిగించకపోగా, సగటు ప్రేక్షకుడిని నిరాశకు గురిచేసాయి. ఇటీవల వచ్చిన ఆరెంజ్ సినిమాలో కనీసం, లాంగ్ టెర్మ్ రిలేషన్ షిప్ గురించి కాస్త విస్తారమైన చర్చ వుంది. కానీ ఇందులో అసలు హీరో, హీరోయిన్‌ను ఎందుకు వదిలేసాడు అని ప్రశ్నిస్తే కనుక, సగటు ప్రేక్షకుడు చెప్పడానికి సరైన సమాధానం వుండదు. అంతవేగంగా ఆ సన్నివేశం రీలు చుట్టేసారు మరి..పైగా ఎంతో అమెచ్యూర్‌గా, ‘నువు చీరలో ఇంతకు ముందే కనిపించి వుంటే నిన్ను వదిలిపెట్టి వుండేవాడిని కాదు’ అనడం త్రివిక్రమ్ వంటి పరిణితి చెందిన మాటల రచయిత నుంచి ఆశించగలిగినది మాత్రం కాదు. అంటే ఏది మంచి అన్నది అంతవరకు హీరోకి తెలియకపోవడం వల్లే చెడ్డదారిన నడిచాడనా? ఆయన చెప్పదలుచుకున్నది? పైగా హీరోకి, మనవారు అనుకునేవారి పట్ల అభిమానం తెలిసేలా చేయడానికి ఏర్పాటుచేసిన 50మిలియన్‌డాలర్ల ఎపిసోడ్ కృతకంగా వుంది. చట్టాలు, పోలీసులు కట్టుదిట్టంగా వుండే దేశంలో నడిరోడ్డులో తీసిన ఆ ఎపిసోడ్ అర్ధవంతంగా లేదు. ఏదో చేద్దామనుకుంటే ఏదో అయినట్లు, హీరో క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా తీర్చిదిద్దుదామనుకుని, కాసనోవాగా మార్చారు. కానీ హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మాత్రం వీలయినంత జాగ్రత్త పడ్డారు. అదే జాగ్రత్త హీరో క్యారెక్టర్ విషయంలో పడివుంటే బాగుండేది. సినిమాలో సరసాలు చూస్తే హై ఫై, కానీ మళ్లీ క్లయిమాక్స్‌కు వచ్చేసరికి పక్కా మేడిన్ ఆంధ్రా మాదిరిగా, హీరో సరాసరి, ప్రియురాలు పెళ్లిచేసుకోవాలనుకునే వాడి ఇంటికి వస్తూనే, కనపడ్డవాడినల్లా చితకబాదడం. మామూలు సినిమా మాదిరిగా చూస్తే మాత్రం హీరో హీరోయిన్ల చక్కటి నటన, వినెసంట్ వారసుడి చక్కటి ఫోటోగ్రఫీ, కాసిన్ని పంచ్‌డైలాగులు (పాడె కట్టడానికి బట్టల దండెం కట్టడానికి పెద్ద తేడాలేదు..కాస్త గట్టిగా కట్టాలంతే, ఎందుకంటే బట్టలకంటే, వాటిని వేసుకునేవాడు ఎక్కువ బరువుంటాడు కదా), బోల్డెన్ని డబ్బులు ఖర్చు చేసిన సగటు సినిమా తీన్‌మార్. తీన్‌మార్ సినిమాకు ఎన్ని డబ్బులు వచ్చాయి. ఎన్ని డబ్బాల ప్రింట్లు వేసారు అన్నది కాస్సేపు పక్కన పెడదాం. ఎంత మంచి చిత్రం అన్నది మాత్రం కాస్త ఆలోచించాలి?

Wednesday, 20 April 2011

ఇండో-అమెరికన్ వైద్యుడికి పులిట్జర్ బహుమతి

భారత సంతతికి చెందిన అమెరికా వైద్యుడు సిద్ధార్థ ముఖర్జీ క్యాన్సర్‌పై రాసిన ద ఎంపరర్ ఆఫ్ ఆల్ మాలడీస్ : ఎ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్‌కు 2011కు గానూ నాన్‌ ఫిక్షన్ కేటగరీలో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ బహుమతి లభించింది. న్యూయార్క్ కేంద్రంగా క్యాన్సర్‌కు చికిత్స చేయటంతో పాటు పరిశోధన చేస్తున్న ముఖర్జీ ఈ పుస్తకంలో క్యాన్సర్ భూతం గూర్చి సమగ్రంగా వివరించారని పులిట్జర్ ఎంపిక కమిటీ తెలిపింది.


ఈ అవార్డుకిచ్చే బహుమతి విలువ 10,000 అమెరికా డాలర్లు. భారత్‌లో జన్మించిన ముఖర్జీ కొలంబియా యూనివర్శిటీ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొపెసర్‌గా పనిచేస్తుండటంతో పాటు కొలంబియా యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌లో క్యాన్సర్‌పై పరిశోధన బృందంలో కూడా పనిచేస్తున్నాడు. ముఖర్జీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌ల నుంచి డిగ్రీని పొందారు.

సిరియాలో దశాబ్దాల పాటు ఉన్న ఎమర్జెన్సీ ఎత్తివేత

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు పెరుగుతుండటంతో సిరియాలో సుమారు 50 సంవత్సరాల పాటు అమలులో ఉన్న ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు సిరియా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అయితే ప్రతిపక్ష నాయకులు మాత్రం ఇవన్ని సంస్కరణలు చేపట్టకుండా ప్రజాందోళనలను అణచివేయటానికి అధ్యక్షుడు బాషర్ అసద్ చేస్తున్న జిమ్మిక్కులని విమర్శిస్తున్నారు.

హద్దుల్లేని అధికారాలను కలిగిన ఎమర్జెన్సీని సంవత్సరాల పాటు విధించిన అసద్ ప్రస్తుతం ప్రజలు ఆయనను గద్దె దిగాలని ఆందోళనలు చేస్తుండటంతో ఎమెర్జెన్నీ తొలగించి తనకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడని ఎమర్జెన్సీతో 16 సంవత్సరాల పాటు జైలులో గడిపిన 
సిరియా ప్రముఖ రచయిత యాసిన్ హజ్ సలేహ్ అన్నారు.

Monday, 18 April 2011

పార్లమెంట్ దే తుది నిర్ణయం అన్న హజారే


పార్లమెంట్ దే తుది నిర్ణయం అన్న హజారే

పార్లమెంటే సుప్రీం, ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ అత్యున్నతమైనది కాబట్టి అది లోక్ పాల బిల్లుని తిరస్కరిస్తే శిరసా వహించాల్సిన భాద్యత ప్రతీ ఒక్క భారతీయ పౌరుడి కర్తవ్యం అని ప్రముఖ సంఘ సామాజిక సంస్కర్త అన్నా హజారే చెప్పారు.
ప్రభుత్వం సరైన మార్గములో వెళ్తే లోక్ పాల్ బిల్లు గడువును పెంచటానికి మాకు ఎటువంటి అబ్యంతరం లేదని తెలిపారు. ఆదివారం కొద్ది మంది పాత్రికేయుల సమావేశములో అన్నా హజారే మరి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు.
అవి ఏమనగా : పార్లమెంట్ తలుచుకుంటే లోక్ పాల్ బిల్లును ఒక్క నెల రోజులలో రూపొందించి అమోదించగలరు.
నేను పార్టి పెట్టాను, ఎన్నికలలో నిలబడను మరియు లబ్ది పొందాలనుకునే ఎటువంటి వారితోను సన్నిహితముగా ఉండను.
ఒక నాయకుడు రెండు ఎన్నికల కాలములో మరింత వ్యత్యాసం చూపిన యెడల వారిపై ఆటో మాటిక్ గా దర్యాప్తు ప్రారంబించాలి, ఈ మేరకు చట్ట నిభంధనలను సవరించాలి.