పార్లమెంటే సుప్రీం, ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ అత్యున్నతమైనది కాబట్టి అది లోక్ పాల బిల్లుని తిరస్కరిస్తే శిరసా వహించాల్సిన భాద్యత ప్రతీ ఒక్క భారతీయ పౌరుడి కర్తవ్యం అని ప్రముఖ సంఘ సామాజిక సంస్కర్త అన్నా హజారే చెప్పారు.
ప్రభుత్వం సరైన మార్గములో వెళ్తే లోక్ పాల్ బిల్లు గడువును పెంచటానికి మాకు ఎటువంటి అబ్యంతరం లేదని తెలిపారు. ఆదివారం కొద్ది మంది పాత్రికేయుల సమావేశములో అన్నా హజారే మరి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు.
అవి ఏమనగా : పార్లమెంట్ తలుచుకుంటే లోక్ పాల్ బిల్లును ఒక్క నెల రోజులలో రూపొందించి అమోదించగలరు.
నేను పార్టి పెట్టాను, ఎన్నికలలో నిలబడను మరియు లబ్ది పొందాలనుకునే ఎటువంటి వారితోను సన్నిహితముగా ఉండను.
ఒక నాయకుడు రెండు ఎన్నికల కాలములో మరింత వ్యత్యాసం చూపిన యెడల వారిపై ఆటో మాటిక్ గా దర్యాప్తు ప్రారంబించాలి, ఈ మేరకు చట్ట నిభంధనలను సవరించాలి. |
No comments:
Post a Comment