భారత సంతతికి చెందిన అమెరికా వైద్యుడు సిద్ధార్థ ముఖర్జీ క్యాన్సర్‌పై రాసిన ద ఎంపరర్ ఆఫ్ ఆల్ మాలడీస్ : ఎ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్‌కు 2011కు గానూ నాన్ ఫిక్షన్ కేటగరీలో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ బహుమతి లభించింది. న్యూయార్క్ కేంద్రంగా క్యాన్సర్‌కు చికిత్స చేయటంతో పాటు పరిశోధన చేస్తున్న ముఖర్జీ ఈ పుస్తకంలో క్యాన్సర్ భూతం గూర్చి సమగ్రంగా వివరించారని పులిట్జర్ ఎంపిక కమిటీ తెలిపింది.
ఈ అవార్డుకిచ్చే బహుమతి విలువ 10,000 అమెరికా డాలర్లు. భారత్‌లో జన్మించిన ముఖర్జీ కొలంబియా యూనివర్శిటీ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొపెసర్‌గా పనిచేస్తుండటంతో పాటు కొలంబియా యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌లో క్యాన్సర్‌పై పరిశోధన బృందంలో కూడా పనిచేస్తున్నాడు. ముఖర్జీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌ల నుంచి డిగ్రీని పొందారు.

No comments:
Post a Comment